టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- May 03, 2024
హైదరాబాద్: గ్లోబల్ ఎడ్యుకేషన్, టాలెంట్ సొల్యూషన్స్ ఆర్గనైజేషన్ అయిన ఈటిఎస్, విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే భారతీయులకు ప్రైజ్ మనీని అందించే జాతీయ స్థాయి పోటీ అయిన టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను పరిచయం చేసింది. మొత్తం ప్రైజ్ మనీ రూ.15 లక్షలను గెలవవచ్చు. భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్, పాల్గొనేవారికి ఆంగ్ల నైపుణ్యం, విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందిస్తుంది. రౌండ్ 1లో 20 నిమిషాల క్విజ్ ఉంటుంది. అయితే రౌండ్ 2లో పాల్గొనేవారు జూలై 31, 2024 వరకు టోఫెల్ ఐబిటి పరీక్షలో పాల్గొనవలసి ఉంటుంది.
టోఫెల్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన సందర్భంగా ఈటీఎఫ్ ఇండియా అండ్ సౌత్ ఆసియా కంట్రీ మేనేజర్ సచిన్ జైన్ మాట్లాడుతూ… టోఫెల్ పోటీలో పాల్గొనేవారు తమ ఆంగ్ల ప్రావీణ్యత నైపుణ్యాలను ప్రదర్శించడానికి, వారి విదేశీ విద్య ప్రయాణంకు కొంత ఖర్చుతో పాటుగా ప్రైజ్ మనీని గెలుచుకోవడానికి ఒక అవకాశం కలుగుతుందన్నారు. టోఫెల్ ఐబిటి అనేది 160 దేశాల్లో 12,500 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు, సంస్థలచే ఆమోదించబడిన ఒక ప్రముఖ పరీక్ష అన్నారు.
టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్ ప్రస్తుతం గుర్తింపు పొందిన భారతీయ ఉన్నత విద్యా సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను అభ్యసిస్తున్న 3వ లేదా 4వ సంవత్సరం కళాశాల విద్యార్థుల నుండి భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ లేదా గ్రాడ్యుయేట్ స్టడీస్ పూర్తి చేసి విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాల కోసం చూస్తున్న వ్యక్తుల వరకూ తెరిచి ఉంచబడిందన్నారు. అలాగే రెండు సంవత్సరాల వరకు ధృవీకరించదగిన పూర్తి సమయం లేదా పార్ట్ టైమ్ పని అనుభవం ఉన్న నిపుణులు కూడా అర్హులన్నారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా