25 రైల్వేస్టేషన్లలో వేడిపాలు, వేడినీళ్లు, శిశువులకు..
- June 08, 2016
ప్రయాణంలో శిశువులకు, బాలింతలకు ఉపయోగపడేలా రైల్వేశాఖ సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. 'జననీ సేవ'గా నామకరణం చేసిన ఈ సేవను రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు బుధవారం ప్రారంభించారు. దీనిలో భాగంగా 25 రైల్వేస్టేషన్లలో వేడిపాలు, వేడినీళ్లు, శిశువులకు అవసరమయ్యే వస్తువులను అందుబాటులో ఉంచారు. దీంతో పాటు 5-12 ఏళ్ల వయసున్న చిన్నారులకు ప్రత్యేక ఆహార మెనూ రూపొందించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ... శిశువుకు పాలు దొరకడం లేదని ఓ బాలింత తనకు ట్వీట్ చేసిందని... దీంతో తాను స్పందించి శిశువుకు వెంటనే పాలు అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఇలాంటి పరిస్థితులు చాలామంది తల్లులు ఎదుర్కొంటున్నారని... అందువల్ల వారందరికీ ప్రయోజనకారిగా ఉండేందుకే 'జననీ సేవ'ను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







