అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలను విభజించాలి : కేసీఆర్‌

- June 08, 2016 , by Maagulf
అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలను విభజించాలి : కేసీఆర్‌

నూతన జిల్లా కేంద్రాలను అభివృద్ధికి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలెక్టర్లకు స్పష్టం చేశారు. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో మండలాలు, జిల్లాల విభజన జరగాలన్నారు. హైదరాబాద్‌లోకలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో కొత్త జిల్లాలు, మండలాలఏర్పాటుపై సీఎం కసరత్తుచేశారు.ప్రస్తుతనియోజకవర్గాలు కాకుండా భవిష్యత్‌ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలనువిభజించాలనిసూచించారు.మండలాలు, జిల్లాల ఏర్పాటుపై ప్రజల మనోభావాలు, భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేయాలని, అవసరమైతే గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశించారు.నూతన మండల వ్యవస్థను అభివృద్ధికి అనుకూలంగా తీర్చిదిద్దాలన్నారు.అవినీతిని సహించొద్దు కిందిస్థాయి ఉద్యోగుల అవినీతిని తీవ్రంగా పరిగణించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు, ఉద్యోగుల్లో నెలకొన్న అవినీతిని రూపుమాపాలన్నారు. సాదా బైనామాలు, రిజిస్ట్రేషన్ల విషయంలో ఎలాంటి ఒత్తిడికి లోనుకావొద్దని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com