పొగ తాగితే ఉద్యోగం ఊడుద్ది

- June 08, 2016 , by Maagulf
పొగ తాగితే ఉద్యోగం ఊడుద్ది

సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌, ప్రైవేట్‌ మరియు ప్రైవేట్‌ సెక్టార్స్‌లో ఉద్యోగుల్ని లేదా కార్మికుల్ని తొలగించడానికి 16 కారణాల్ని చూపుతూ స్పష్టతనిచ్చింది. ఇందులో అనుమతి లేకుండా 7 నుంచి 10 రోజుల విధులకు గైర్హాజరయినప్పుడు, వరుసగా 15 రోజలపాటు విధులకు హాజరు కానప్పుడు, అలాగే నిర్లక్ష్యం, స్త్రీ పురుషుడితోనూ లేదా పురుషుడు స్త్రీతోనూ ఏకాంతంగా దొరికిపోవడం, పొగ తాగడం, అటెండెన్స్‌ టైమింగ్స్‌ని టాంపర్‌ చేయడం, నిర్లక్ష్యం, అధికారిక సూచనల్ని లెక్క చేయకపోవడం వంటివాటిని ఇందులో చేర్చారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన ఉద్యోగులు లేదా కార్మికులకు హెచ్చరికలు జారీ చేయడం, జీతాల్లో కోత, పని నుంచి తొలగించడం, అది కూడా బోనస్‌ ఇచ్చి, ఇవ్వకుండా కూడా చేసే అవకాశం ఉంటుంది. సహచరుడిపై భౌతిక దాడి చేసినప్పుడు, బోనస్‌ ఇవ్వకుండా విధుల నుంచి తొలగించవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com