‘రాజు యాదవ్’ కోసం ‘హనుమాన్’.!

- May 06, 2024 , by Maagulf
‘రాజు యాదవ్’ కోసం ‘హనుమాన్’.!

జబర్దస్త్ కామెడీతో పాపులర్ అయిన గెటప్ శీను నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెడీతో పాటూ, ఎటువంటి పర్‌ఫామెన్స్ అయినా ఇరగదీసేయగల సత్తా వున్నోడు గెటప్ శీను నామధేయుడైన శీను.

రీసెంట్‌గా ‘హనుమాన్’ సినిమాలో హీరోకి దాదాపు ఈక్వెల్ పాత్రలో నటించి మెప్పించాడు హీరోకి ఫ్రెండ్ పాత్రలో. ఇక, ఇప్పుడు హీరోగా రాబోతున్నాడు ‘రాజు యాదవ్’ సినిమాతో.

రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మొదట్నుంచీ ఆధ్యంతం వినోదాత్మకంగా సాగింది గెటప్ శీను కామెడీ స్టైల్‌లో. అయితే, మూతికి క్రికెట్ బాల్ తగలడం వల్ల వంకరగా మారిపోతుంది.  అది కాస్తా.. మెల్ల మెల్లగా  స్మైలీ ఎక్స్‌ప్రెషన్‌లోనే ముఖం వుండిపోతుంది.

కొట్టినా, తిట్టినా.. బాధపడినా కూడా ముఖంలో స్మైలీ ఎక్స్‌ప్రెషనే. ఆ కారణంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాజు యాదవ్. మొదట కామెడీగానే డిజైన్ చేసినా ట్రైలర్ చివరికొచ్చేసరికి కొంత ఎమోషన్‌తోనూ కట్టి పడేశాడు రాజు యాదవ్.

ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో హనుమాన్ హీరో తేజ సజ్జా కూడా పాల్గొంటున్నాడు. తన రీల్ ఫ్రెండ్ కోసం సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని ఆశిస్తున్నాడు. చూడాలి మరి, ‘రాజు యాదవ్’గా గెటప్ శీను ఎంత మేర ఆకట్టుకోనున్నాడో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com