దుబాయ్‌లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- May 09, 2024
యూఏఈ: దుబాయ్‌లో ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం తెలిపారు. కొత్త ప్రణాళిక ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో పని విధానాల అమలును మెరుగుపరచునుంది. దుబాయ్ అంతటా ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే కొత్త ప్లాన్ లక్ష్యం. అయితే ఈ విధానాన్ని ఎలా, ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై వెంటనే స్పష్టత రాలేదు. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ట్రాఫిక్‌ను ఈజీ ప్లో కు అనువైన గంటలు మరియు రిమోట్ పని ఎలా సహాయపడుతుందనే దానిపై డేటాను సేకరించడానికి దుబాయ్‌లోని అధికారులు ఇంతకు ముందు సమగ్ర సర్వేను ప్రారంభించారు. దుబాయ్‌లోని కార్యాలయాలు అత్యవసర సమయాల్లో ఉద్యోగుల కోసం రిమోట్ పనిని యాక్టివేట్ చేయడానికి డిజిటల్ మౌలిక సదుపాయాలను పెంచనున్నాయి. ఏప్రిల్ మధ్యలో మరియు మే ప్రారంభంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసిన తర్వాత, ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ కార్యాలయాలు ఆన్‌లైన్ విధనంలోకి వచ్చాయి. బుధవారం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదించిన ట్రాఫిక్ ఫ్లో ప్లాన్‌లో ట్రిప్ టైమ్‌లను 59 శాతం వరకు మెరుగుపరచడానికి ప్రాధాన్యత గల పబ్లిక్ బస్సు మార్గాలను అభివృద్ధి చేయడం కూడా ఉంది. అంతకుముందు, రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) దుబాయ్ డెడికేటెడ్ బస్ లేన్‌ల నెట్‌వర్క్‌ను 20 కి.మీలకు పైగా పెంచే ప్రణాళికను ప్రకటించింది. 2025 మరియు 2027 మధ్య లేన్‌లు పూర్తవుతాయి. ట్రాఫిక్ ఫ్లో ప్లాన్‌లో పాఠశాల విద్యార్థులను పాఠశాల రవాణాను ఉపయోగించమని ప్రోత్సహించడానికి ఒక విధానాన్ని అభివృద్ధి చేయడం కూడా ఉంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో అరేబియా ట్రావెల్ మార్కెట్ సందర్భంగా జరిగిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలోనే కొత్త ప్లాన్ ను ఆమోదించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







