66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- May 09, 2024
రియాద్: ఎలక్ట్రానిక్ విజిట్ వీసాలు పొందేందుకు అర్హత ఉన్న దేశాల జాబితాలో మూడు కొత్త దేశాలను చేర్చినట్లు సౌదీ అరేబియా బుధవారం ప్రకటించింది. కొత్త చేరిన దేశాలలో కామన్వెల్త్
కరేబియన్ దేశాలైన బహామాస్, బార్బడోస్ మరియు గ్రెనడా ఉన్నాయి. ఈ విస్తరణతో ఇ-విజిట్ వీసా పాలనలో ఉన్న మొత్తం దేశాల సంఖ్య 66కి చేరుకుంది. సౌదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ మూడు దేశాల పౌరులు దీనికి అర్హులని ప్రకటించింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే సందర్శకులకు మరపురాని పర్యాటక అనుభూతిని అందించడానికి సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాలలో ఈ స్కీమ్ ను ప్రవేశ పెట్టారు. ఈ దేశాల పౌరులకు ఒక సంవత్సరం చెల్లుబాటుతో మల్టీ రీఎంట్రీ ఇ-విజిట్ వీసా మంజూరు చేయబడుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరిన్ని వివరాలను visitsaudi.com వెబ్‌సైట్ నుండి పొందవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







