సినిమా రివ్యూ: ‘ప్రతినిధి 2’
- May 10, 2024నారా రోహిత్ ప్రధాన పాత్రలో సుపరిచితుడైన న్యూస్ రిపోర్టర్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ప్రతినిధి 2’. చాన్నాళ్ల క్రితం వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్న ‘ప్రతినిధి’ కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రమిది. ఓ సామాన్యుడు చట్ట సభలకు ఎదురు తిరిగితే పరిణామాలు ఎలా వుంటాయన్న నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా అప్పట్లో ఓ సంచలనమే. అలాగే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ‘ప్రతినిధి 2’ ఎలా వుందనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
ఫ్రీలాన్సింగ్ జర్నలిస్ట్‌గా పని చేస్తూ.. రాజకీయాల్లో జరుగుతున్న అకృత్యాల్ని నిజాయితీగా, ధైర్యంగా ప్రశ్నిస్తుంటాడు చే అలియాస్ చేతన్ (నారా రోహిత్). ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్ అతన్ని ఏరి కోరి తీసుకొచ్చి తన ఛానెల్‌కి సీఈఓని చేస్తుంది. సదరు ఛానెల్ సీఈఓగా తనదైన స్టైల్‌లో పలువురు రాజకీయ నాయకుల అన్యాయాల్ని, అరాచకాల్ని ఎండకడుతుంటాడు చై. తద్వారా చాలా మంది రాజీకీయ ప్రముఖుల్ని తన జర్నలిజంతో ప్రభావితం చేస్తుంటాడు. ఇదిలా వుండగా.. మరోవైపు ప్రజా శ్రేయస్సు పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిపై హత్యా యత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో ఆయన ప్రాణాలు కోల్పోతారు. ఈ టైమ్‌లోనే ఆయన పదవిని దక్కించుకోవాలని చూస్తాడు అతని కుమారుడు. కానీ, ఆ ప్రయత్నాన్ని చే అడ్డుకుంటాడు. అసలు ముఖ్యమంత్రిని చంపే అవసరం ఎవరికి వుంది.? ఆ హత్యా ప్రయత్నం వెనక వున్నదెవరు.? నిజంగానే ముఖ్యమంత్రి చనిపోయాడా.? ఈ నిజాన్ని తన న్యూస్ ఛానెల్ ద్వారా చే ఎలా ఛేదించాడు.? అనేది తెలియాలంటే ‘ప్రతినిధి 2’ ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
నారా రోహిత్ నటనకు దూరమై చాలా కాలమే అయ్యింది. కానీ, ఆ గ్యాప్ ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. నిజానికి చెప్పాలంటే ఈ తరహా పాత్రలు నారా రోహిత్‌కి కొట్టిన పిండే. చాలా ఇంటెన్స్‌గా ఈజీగా చే పాత్రలో ఒదిగిపోయాడు. ఫస్టాప్‌లో నారా రోహిత్ లుక్స్ కూడా బాగున్నాయ్. హీరోయిన్ సిరి లెల్ల పాత్రకు ఇంపార్టెన్స్ కూడా బాగుంది. ఆమె పాత్రను కథలో లీనం చేసిన వైనం ఆకట్టుకుంటుంది. కానీ, ఆమెనే హీరోయిన్ అనే విషయం మాత్రం సెకండాఫ్ వచ్చే వరకూ క్లారిటీ వుండదు. మరో కీలక పాత్ర పోషించిన దినేష్ తేజ్ ఆకట్టుకుంటాడు. గుర్తుండిపోయే పాత్రలో కనిపించాడీ నటుడు. అలాగే సప్తగిరి, తనికెళ్ల భరణి, ఇంద్రజ, జిషుసేన్ గుప్తా, ఉదయభాను, అజయ్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పని తీరు:
చిన్న స్కేల్ వున్న సినిమా. లిమిటెడ్ నిర్మాణ బడ్జెట్. అయినప్పటికీ ఉన్న లిమిట్‌లో నిర్మాణ విలువలు బాగున్నాయ్. మహతి సాగర్ మ్యూజిక్ బాగుంది. పతాక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశానికి తగ్గట్టుగా వుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సన్నివేశాలు ఎంతో రియలిస్టిక్‌గా అనిపిస్తాయ్. ఎడిటింగ్ ఓకే. ఇక దర్శకుడు మూర్తి గుప్తదేవపుకి దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. నిజానికి మూర్తి అనగానే ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా వుంటుందీ చిత్ర కథ, కథనం అని ఆశిస్తాం. కానీ, ఆ ముద్ర పడకుండా చూసుకున్నాడు. అయితే కథనం ఇంకాస్త బాగా రాసుకుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వస్తున్నాయ్. ఫస్టాఫ్ కొంత బెటర్‌గానే సాగినా.. సెకండాఫ్‌కి వచ్చేసరికి అసలు కాన్‌ఫ్టిక్ట్ మిస్ అయ్యిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
ప్లస్ పాయింట్స్:
ఫస్టాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, నారా రోహిత్ నటన, అక్కడక్కడా కొన్ని పొలిటికల్ ట్విస్టులు, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా. ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటర్ని చైతన్యవంతుడ్ని చేసేలా చిత్రీకరించిన ఎపిసోడ్ సినిమాకి హైలైట్. ఈ టైమ్‌లో ఆ పాయింట్ సినిమాకి మెయిన్ అస్సెట్ అవడమే కాక, తమ వంతుగా సొసైటీకి ఈ సినిమా ద్వారా ఒకింత మేలు చేసిన గొప్పతనం ఈ సినిమా ద్వారా చిత్ర యూనిట్ అందరికీ దక్కుతుందనడం అతిశయోక్తి కాదు.
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్‌లో సాగతీతగా అనిపించిన కొన్ని సన్నివేశాలు సినిమాని బాగా దెబ్బ తీసేశాయ్. ప్రేక్షకులకి కనెక్ట్ కాని స్క్రీన్‌ప్లేతో కాస్త విసుగు తెప్పిస్తుంది. అలాగే ఫస్టాఫ్‌లో చాలా నేచురల్‌గా సాగిన సన్నివేశాలు కాస్తా, సెకండాఫ్‌కి వచ్చేసరికి డ్రమటిక్‌గా అనిపిస్తాయ్. అయినప్పటికీ సినిమాటిక్ లిబర్టీని పక్కన పెట్టి చూస్తే అవన్నీ కవర్ అయిపోతాయనుకోండి.
చివరిగా:
రాజకీయాల్లో జరుగుతున్న అకృత్యాలని ప్రశ్నించే ఓ గొంతుక ‘ప్రతినిధి 2’. పొలిటికల్ యాక్షన్ డ్రామాని ఇష్టపడేవారికి ‘ప్రతినిధి 2’ ఖచ్చితంగా నచ్చుతుంది.
తాజా వార్తలు
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం