యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- May 11, 2024
యూఏఈ: ఎతిహాద్ రైల్, ఒమన్ రైల్ మరియు ముబాదలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఒమానీ-ఎమిరాటీ రైల్వే నెట్‌వర్క్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒమన్ సుల్తాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ UAEలో రాష్ట్ర పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డెవలప్‌మెంట్ అండ్ ఫాలెన్ హీరోస్ అఫైర్స్ కోసం ప్రెసిడెన్షియల్ కోర్ట్ డిప్యూటీ చైర్మన్, ఎతిహాద్ రైల్ చైర్మన్ షేక్ థెయాబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. సంయుక్త రైల్వే నెట్‌వర్క్ మొత్తం US$3 బిలియన్ల పెట్టుబడితో ప్రారంభం కానుంది. యూఏఈ మరియు ఒమన్‌లను ప్రాంతీయ మార్కెట్‌లకు గేట్‌వేలుగా విస్తరింపజేస్తుంది. రెండు దేశాల్లోనూ వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పనకు ఈ నెట్‌వర్క్ ను మెరుగు పరుచనుంది. గతంలో ఒమన్-ఎతిహాద్ రైల్ కంపెనీ, జాయింట్ వెంచర్ ఇప్పుడు హఫీత్ రైల్ అని పిలిచారు. ఒమన్ సుల్తానేట్ మరియు యూఏఈ మధ్య విస్తరించి ఉన్న జెబెల్ హఫీత్‌కు నివాళిగా ఈ పేరు పెట్టారు. జెబెల్ హఫీత్ రెండు దేశాలకు వ్యూహాత్మక ప్రాముఖ్యత మరియు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పర్వతాలు, ఎడారుల గుండా సాగే ఈ మార్గంతో మైనింగ్, ఇనుము మరియు ఉక్కు, వ్యవసాయం మరియు ఆహారం, రిటైల్, ఇ-కామర్స్ మరియు పెట్రోకెమికల్ రంగం వంటి వివిధ రంగాల అభివృద్ధికి హఫీత్ రైల్ దోహదపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!