యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- May 11, 2024
యూఏఈ: ఉమ్రా కోసం ఇ-వీసాలు మరియు సరసమైన ప్యాకేజీలు యాత్రికులకు అందుబాటులో ఉన్నది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు హజ్ తీర్థయాత్రకు (జూన్ 14-19) సిద్ధమవుతున్నందున, ఇప్పుడు యూఏఈ నివాసితులు ఉమ్రా చేయడానికి నుసుక్ యాప్‌లో స్లాట్‌ను బుక్ చేసుకోవడం తప్పనిసరి. అలాగే, చెల్లుబాటు అయ్యే ఉమ్రా వీసాలు ఉన్న వ్యక్తులు మాత్రమే తీర్థయాత్రను చేపట్టే అవకాశం ఉన్నది. సౌదీ అరేబియా ఉమ్రా వీసాదారుల ప్రవేశ తేదీని మే 23గా, ఎగ్జిట్ తేదీని జూన్ 6 గా ప్రకటించడంతో, యాత్రికులు తీర్థయాత్రను ప్రారంభించే అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. ASAA టూరిజం నుండి ఖైజర్ మహమూద్ మాట్లాడుతూ.. హజ్ సీజన్ ప్రారంభమయ్యే ముందు ఉమ్రాను ప్రారంభించాలని కోరుకునే నివాసితుల నుండి తమ ఏజెన్సీకి ప్రతిరోజూ వందకు పైగా కాల్స్ వస్తాయని చెప్పారు. టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు నుసుక్ యాప్ ద్వారా ఉమ్రా కోసం స్లాట్లను తప్పనిసరిగా బుక్ చేసుకోవాలని మహమూద్ చెప్పారు. అదే విధంగా వచ్చిన యాత్రికులు హజ్ సీజన్లో లేదా అంతకు ముందు పవిత్ర స్థలాలను వదిలిపెట్టకుండా నిబంధనలను ఉల్లంఘించిన వారికి కఠినమైన జరిమానాలు వేచి ఉన్నాయని చెప్పారు. రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు SAR 50,000 వరకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!