ఒత్తిడిని తగ్గించి ఉపశమనం దొరకాలంటే... .ఈ చాయ్‌లు తాగండి!

- June 08, 2016 , by Maagulf
ఒత్తిడిని తగ్గించి ఉపశమనం దొరకాలంటే... .ఈ చాయ్‌లు తాగండి!


ఏ మాత్రం ఒత్తిడి మొదలైనా.. అది ఆలోచనల్ని చిత్తు చేస్తుంది. ఇలాంటప్పుడు కాస్త ఉపశమనం దొరకాలంటే... ఉద్వేగాలు అదుపులో ఉండాలంటే... మీ మూడ్‌ మారాలంటే... ఈ టీలలో దేన్ని తీసుకున్నా ఫరవాలేదంటున్నాయి పలు అధ్యయనాలు. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లకు వ్యాధినిరోధక వ్యవస్థను దృఢపరచడమే కాదు, రకరకాల క్యాన్సర్లను నిరోధించే శక్తి కూడా ఉంది. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించి మనసుని ప్రశాంతంగా మారుస్తాయి.
బ్లాక్‌ టీ: ఇందులో అధికమోతాదులో యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి విషపూరిత రసాయనాల ప్రభావానికి శరీరం లోనుకాకుండా కాపాడతాయి. అంతేనా! మానసిక ప్రశాంతతనూ, శరీరానికి విశాంత్రినీ అందిస్తుంది బ్లాక్‌టీ. వ్యాయామం చేశాక ఈ టీని తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. పలు అధ్యయనాల ప్రకారం లిథయనైన్‌ అనే అమినో యాసిడ్‌ ఈ టీలో ఉంటుంది. ఇది మెదడుకి ఏకాగ్రతనూ అందిస్తుంది. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌ స్థాయుల్నీ తగ్గిస్తుంది.
వైట్‌ టీ: ఈ టీలో కెఫీన్‌ తక్కువగా, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీరాఢికల్స్‌ బారి నుంచి కాపాడతాయి. శరీర వ్యవస్థకు రక్షణగా నిలిచి రక్తపోటుని అదుపులో ఉంచుతాయి. తేలికపాటి సువాసన, రుచి కలిగిన వైట్‌ టీ ఒత్తిడిని దూరం చేస్తుంది. మనసుని తేలికపరుస్తుంది. అధ్యయనాల ప్రకారం గుండెకు రక్తప్రసరణ చేసే రక్తనాళాల పనితీరుని మెరుగుపరుస్తుంది. నీరసం ఆవహించినప్పుడు దీన్ని ఒక్క కప్పు తాగితే చాలు అప్పటికప్పుడు శక్తి అందించే ఎనర్జీబూస్టర్‌లా ఈ టీ పనిచేస్తుంది.
రోస్టెడ్‌ బార్లీ టీ: సాధారణంగా బార్లీగింజలతో జావ చేసుకోవడం తెలిసిందే కానీ.. ఇప్పుడు రోస్టెడ్‌ బార్లీ టీ కూడా అందుబాటులో వచ్చింది. దీన్ని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయి. ఇది శరీరంలోని కొవ్వునీ తగ్గిస్తుంది. బార్లీ టీలలో ఉండే మెలటోనిన్‌, ట్రిప్టోఫాన్‌ అమినో యాసిడ్‌లు కలతలేని నిద్ర పోవడానికి తోడ్పడతాయి. ఫలితంగా ఒత్తిడి దరిచేరదు. ఈ టీలో కెఫీన్‌ ఉండదు. ఫలితంగా నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం తక్కువే. రోజూ దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు దూరమవుతాయి. ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్‌లు, ఫైటోన్యూట్రియంట్‌లు శరీరంలోని ఫ్రీరాఢికల్స్‌ని బయటకు పంపిస్తాయి. ఒత్తిడిని దూరం చేసి విశ్రాంతిని అందిస్తాయి.
గ్రీన్‌ టీ: సహజ పరిమళం, రకరకాల రుచుల్లో లభించే గ్రీన్‌టీని తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ టీలో ఉండే ఔషధగుణాలు ధ్యానం చేసిన ఫలితాన్నిస్తాయి. ఇక రోజూ గ్రీన్‌ టీ తీసుకోగలిగితే అధిక రక్తపోటుని అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నాయి పలు అధ్యయనాలు. దీనిలో లభించే థియనైన్‌ అనే అమినో యాసిడ్‌ మనసుని శాంత పరచడంలో కీలకంగా పనిచేస్తుంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com