విలన్‌గా దర్శకుడు ఎస్.జె. సూర్య..
- June 08, 2016
మహేశ్‌బాబు హీరోగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విలన్‌గా దర్శకుడు ఎస్.జె. సూర్య నటిస్తారనే వార్త ఇప్పటికే ప్రచారంలో ఉంది. మరోవైపు రజనీకాంత్ '2.0'లో విలన్‌గా నటిస్తున్న హిందీ నటుడు అక్షయ్‌కుమార్ పేరు కూడా వినిపించింది. ఫైనల్లీ యస్.జె. సూర్య ఖరారయ్యారు. ఈ విషయాన్ని చిత్రదర్శకుడు మురుగదాస్ స్వయంగా ప్రకటించారు.దర్శకుడిగా తమిళంలో 'వాలి', తెలుగులో 'ఖుషి' చిత్రాలు సూర్యకు మంచి పేరు తెచ్చాయి. ఇంకా ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటించారు. ఇప్పుడు మహేశ్‌బాబు సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు.వచ్చే నెల 15న ఈ చిత్రం షూటింగ్ ఆరంభమయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ఈ చిత్రంలో నటిస్తూనే మరోవైపు పవన్ కల్యాణ్ హీరోగా తాను దర్శకత్వం వహించనున్న చిత్రంతో ఎస్.జె. సూర్య బిజీ కానున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







