దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్‌లకు నేరుగా బస్సులు

- May 13, 2024 , by Maagulf
దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్‌లకు నేరుగా బస్సులు

యూఏఈ: బిజినెస్ బే మెట్రో స్టేషన్ నుండి ఇతర మెట్రో స్టేషన్‌లకు డైరెక్ట్ బస్సులను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ ప్రకటించింది. బిజినెస్ బే మెట్రో స్టేషన్‌లోని ఎగ్జిట్ 2 నుండి బస్సులు బిజినెస్ బే నుండి ఆన్‌పాసివ్ స్టేషన్ వరకు, బిజినెస్ బే నుండి మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, ఈక్విటీ మరియు మష్రెక్ స్టేషన్ల వరకు, బిజినెస్ బే నుండి అల్ ఖైల్ మరియు దుబాయ్ ఇంటర్నెట్ సిటీ స్టేషన్ల వరకు ప్రయాణిస్తాయి.

నాలుగు దుబాయ్ మెట్రో స్టేషన్లు, ఆన్‌పాసివ్, ఈక్విటీ, మష్రెక్ మరియు ఎనర్జీ మెట్రో కూడా మే 28 నాటికి సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించనున్నారు. ఏప్రిల్ మధ్యలో ఎమిరేట్‌లో భారీ వర్షాలు కురువడంతో ఈ మెట్రో స్టేషన్‌లు తాత్కాలికంగా మూసివేసారు.

బిజినెస్ బేలో సేవలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా RTA కూడా 'బస్ ఆన్ డిమాండ్' సేవను ఈ ప్రాంతానికి విస్తరించింది. ఈ సేవ 'దుబాయ్ బస్ ఆన్ డిమాండ్' యాప్ ద్వారా పనిచేస్తుంది మరియు 14-సీట్ల బస్సులను నడపనుంది.ఈ బస్సుల డ్రైవర్లు యాప్ ద్వారా సర్వీస్ రిక్వెస్ట్ చేసే వారితో నేరుగా కమ్యూనికేట్ అవుతుంది. దీని ద్వారా వారు ప్రస్తుతం సర్వీస్ పరిధిలో ఉన్న అల్ బర్షా, అల్ నహ్దా, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ మరియు బిజినెస్ బేలలోని స్థానానికి సమీపంలో ఉన్న ప్రదేశానికి నేరుగా ప్రయాణికులు చేరుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com