సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల..

- May 13, 2024 , by Maagulf
సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల..

న్యూ ఢిల్లీ: సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాలను విడుదల చేసిన కొంతసేపటికే.. క్లాస్​ 10 ఫలితాలను విడుదల చేసింది.. సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకెండరీ ఎడ్జ్యుకేషన్.

డిజీలాకర్​తో పాటు http://cbse.nic.in లో కూడా సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలను చెక్​ చేసుకోవచ్చు.

సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు 2024 డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సీబీఎస్​ఈ ఫలితాలను ఇలా చెక్​ చేసుకోండి..

డిజీలాకర్​లో సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు ఎలా చెక్​ చేసుకోవాలో ఇక్కడ చూడండి..

స్టెప్​ 1:- డిజీలాకర్​ యాప్​ లేదా వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- అకౌంట్​ ఉంటే సైన్​-ఇన్​ చేసుకోండి. లేకపోతే అకౌంట్​ క్రియేట్​ చేసుకోండి.

CBSE 10 result 2024 date : స్టెప్​ 3:- హోం పేజ్​లోకి వెళ్లి.. సీబీఎస్​ఈ క్లాస్​ 10 రిజల్ట్స్​ లింక్​ కోసం చూడండి. దాని మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 4:- సంబంధిత వివరాలను సబ్మీట్​ చేయండి. స్కోర్​ డిస్​ప్లే అవుతుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 15- మార్చ్​ 13 మధ్యలో సీబీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షలు జరిగాయి.

కొంతసేపటి క్రితమే.. క్లాస్​ 12 ఫలితాలను సైతం విడుదల చేసింది సీబీఎస్​ఈ.

ఈ ఏడాది సీబీఎస్​ఈ క్లాస్​ 12 పరీక్షల కోసం 16,33,730 విద్యార్థులు రిజిస్టర్​ చేసుకున్నట్టు.. వీరిలో 16,21,224 మంది పరీక్షకు హాజరైనట్టు సీబీఎస్​ఈ తెలిపింది. ఇక పరీక్ష రాసిన వారిలో 14,26,420 మంది పాస్​ అయినట్టు పేర్కొంది. సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఉత్తీర్ణత శాతం 87.9గా ఉంది. గతేడాది ఇది 87.33శాతంగా ఉండేది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com