యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!

- May 14, 2024 , by Maagulf
యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!

యూఏఈ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సోమవారం 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల్లో విద్యాసంస్థలు అద్భుతమైన ఉత్తీర్ణత రేటును నమోదు చేయడంతో యూఏఈలోని చాలా CBSE-అనుబంధ పాఠశాలల్లో విద్యార్థులు ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు CBSE వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించడంతో లాగిన్ సమస్యలు తలెత్తినట్లు నివేదికలు వచ్చాయి. షార్జా ఇండియన్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రమోద్ మహాజన్‌ మాట్లాడుతూ..విద్యార్థులు తమ ఫలితాలను తనిఖీ చేయడానికి వెంటనే లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రారంభ అడ్డంకులు ఎదుర్కొన్నారు. అయితే గంట వ్యవధిలోనే సమస్య క్లియర్ అయిందన్నారు. CBSE ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి పరీక్షలను నిర్వహించింది. 10వ తరగతి బోర్డ్ పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి మార్చి 13 వరకు జరిగాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com