సౌదీ యువరాజు సామాజిక సేవ
- July 02, 2015
సామాజిక సేవకు సౌదీ ప్రిన్స్ రూ. 2 లక్షల కోట్ల దానం రియాద్: సౌదీ అరేబియా యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ తన రూ. 2 లక్షల కోట్ల సంపదను సమాజసేవకు వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ప్రజాసేవ కోసం తాను తీసుకున్న ఈ నిర్ణయం సమాజ అభివృద్ధికి, మహిళల సాధికారతకు, యువత నైపుణ్యాభివృద్ధికి, విపత్తు సహాయానికి ఉపయోగపడుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఒక ప్రణాళికను రూపొందించి చారిటీ ప్రాజెక్టుల ద్వారా ఈ నిధులను వినియోగిస్తామని, ట్రస్టుల బోర్డుకు తాను చైర్మన్గా ఉంటానని తెలిపారు. అమెరికాలోని బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తరహాలో తన చారిటీ ట్రస్ట్ పని చేస్తుందని వెల్లడించారు. అల్వలీద్కు ప్రభుత్వ పదవి ఏదీ లేదు. ఆయన చైర్మన్గా వ్యవహరిస్తున్న కింగ్డమ్ హోల్డింగ్ కంపెనీ యాజమాన్య వాటా కాకుండా ఇతరత్రా ఉన్న సంపదను మాత్రమే ఈ చారిటీకి అప్పగిస్తున్నారు. అల్వలీద్ గత జనవరిలో చనిపోయిన సౌదీరాజు అబ్దుల్లాకు సమీప బంధువు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







