తెలుగు ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు : జయప్రద
- June 08, 2016
తెలుగు ప్రేక్షకులు, ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, వారి ఆదరాభిమానాలు ఎప్పటికీ మరువలేనని ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద పేర్కొన్నారు. మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు బుధవారం రాత్రి మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్ సురేంద్రనాధ్‌రెడ్డి ఆమెకు స్వాగతం పలికారు.అనంతరం ఆమె శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. వినాయకనందీశ్వరస్వామి దర్శనం అనంతరం ఆమె మాట్లాడుతూ మహానంది క్షేత్రానికి రావడం ఇదే మొదటిసారి అని, ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహానంది పుణ్యక్షేత్రం పర్యాటక స్థలంగా మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానన్నారు.నూతన దర్శకుడు నరసింహం దర్శకత్వంలో వస్తున్న 'శరభ' చిత్రం ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నానని తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







