కీర్తి సురేష్ బాలీవుడ్‌లో బిజీ కానుందా.?

- May 15, 2024 , by Maagulf
కీర్తి సురేష్ బాలీవుడ్‌లో బిజీ కానుందా.?

మహానటి కీర్తి సురేష్‌ అంటే మాటలా.! ఎక్కడున్నా తన ఉనికిని ప్రత్యేకంగా చాటుకుంటుందీ ముద్దుగుమ్మ. సౌత్ భాషల్లో తానేంటో ప్రూవ్ చేసుకుందిప్పటికే.

ఇక, ఇప్పుడు నార్త్‌లో అడుగు పెట్టింది. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘తెరి’ హిందీ రీమేక్‌లో కీర్తి సురేష్ నటిస్తోంది. ఇదే బాలీవుడ్‌లో కీర్తి సురేష్‌కి ఫస్ట్ సినిమా.

వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలో. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే కీర్తి సురేష్ పేరు అక్కడ ట్రెండింగ్ అయిపోయింది. దీంతో పాటూ, మరో రెండు క్రేజీ ప్రాజెక్టులపై కీర్తి సురేష్ సైన్ చేసిందనీ తెలుస్తోంది.

అందులో అక్షయ్ కుమార్ సినిమా ఒకటుందని అంటున్నారు. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందబోయే ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ నుంచి పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో వున్నాయట.

కానీ, ఆ లిస్టులోకి తాజాగా కీర్తి సురేష్ పేరు వచ్చి చేరిందనీ తెలుస్తోంది. రీసెంట్‌గా ‘సైరన్’ అనే ఓ మలయాళ సినిమాలో కీర్తి సురేష్ పోలీసాఫీసర్ పాత్రలో నటించి మంచి మార్కులేయించుకుంది. ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో వుంది. జయం రవి లీడ్ రోల్ పోషించాడీ సినిమాలో. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com