దుబాయ్ వేదికగా ఆగష్టు లో 'సైమా అవార్డ్స్'
- July 02, 2015
తెలుగు,తమిళ, కన్నడ, మళయాళ చిత్ర పరిశ్రమలు కలిసి చేసే సినిమా వేడుక సైమా అవార్డ్స్. ఈ సారి నాలుగోసారి అవార్డ్ ల వేడుక జరుగుతోంది. ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు దక్షిణాదికి చెందిన నాలుగు సినీ పరిశ్రమలు కలిసి ఈ వేడుకను నిర్వహించటం చాలా హ్యాపీగా ఉందని ఈ ప్రెస్ మీట్ లో నిర్వాహకులు అన్నారు. ఈ వేడకకు దుబాయ్ అతిధ్యం ఇవ్వడంలో అంతర్జాతీయంగా మనకు మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. 'సైమా' (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) నాలుగో పురస్కారాల వేడుకను వచ్చే నెల 6, 7 తేదీల్లో దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 'సైమా' విశేషాలను బుధవారం రాత్రి హైదరాబాద్‌లో తెలియచేసారు. నాలుగు దక్షిణాది చిత్ర పరిశ్రమలు అంతర్జాతీయ స్థాయిలో పురస్కార వేడుక జరుపుకుంటున్నాయి. 'సైమా'లో పాల్గొనడం ఓ మధురమైన జ్ఞాపకం. రానా మాట్లాడుతూ... నాలుగు భాషల నుంచి అద్భుతమైన చిత్రాలొచ్చాయి. వేడుక మరింత ఘనంగా జరగబోతోంది''అన్నారు. ఎంపికైతే బాగుంటుంది అన్న ప్రశ్నకు ''పోటీలో లేకపోయినా అక్కినేని నాగేశ్వరరావుగారికి పురస్కారం ఇవ్వడమే సముచితమని భావిస్తున్నా''నని చెప్పారు రానా. అని అడగ్గా ''వెంకటేష్‌గారికి చాలా అవార్డులొచ్చాయి. ఒకవేళ ఆయనకు 'సైమా' పురస్కారం వస్తే దాన్ని నేనే తీసుకురావాల్సి ఉంటుంది. అందుకే నాగచైతన్యకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా'' అని సమాధానం ఇచ్చారు రానా. ''సైమా పురస్కారాల వేడుకతో నాకెన్నో జ్ఞాపకాలున్నాయి. ప్రతిసారీ ఆ వేడుకలో పాల్గొంటున్నా. రెండు రోజుల పాటు సహ నటులతో కలిసి సందడి చేయడం ఓ చక్కటి అనుభూతి అన్నారు. ఇది వరకు దర్శకుడు శంకర్, నటి శ్రీదేవి సమక్షంలో వాళ్ల చిత్రాల్లోని పాటలకు డాన్స్ చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది''అని చెప్పింది. ''నేను తొలిసారి ఓ వేదికపై ప్రదర్శన ఇవ్వబోతున్నాను. అది 'సైమా' వేడుక కావడం సంతోషమ''ని చెప్పింది పూజా హెగ్డే. ''సైమా' అతి పెద్ద పురస్కార వేడుకగా మారింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలన్నింటినీ ఒకతాటిపైకి తీసుకొస్తుంది. ఎప్పుడులేని విధంగా ఈ సారి 20మంది తారలతో ప్రదర్శనలు ఉంటాయి''అన్నారు. కృతి కర్బంద, ఆదా శర్మ, షర్మిలా మాండ్రే, సైమా మార్కెటింగ్ డైరెక్టర్ తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల నామినేషన్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ అవార్డులకు సంబంధించి బెస్ట్ యాక్టర్ రేసులో అసలు మహేష్ బాబు పేరు లేక పోవడం పలువురు అభిమానులను ఆశ్చర్య పోయేలా చేసింది. '1-నేనొక్కడినే' సినిమాలో మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అలాంటిది ఆయన పేరు కనీసం నామినేషన్స్ లిస్టులో లేక పోవడం ఇటీవల చర్చనీయాంశం అయింది. తాజాగా విడుదలైన సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) 2015 నామినేషన్ల లిస్టులో ఉత్తమ నటుడి కేటగిరీలో మహేష్ బాబు కూడా నిమినేట్ అయ్యారు. వివిధ అంశాలకు సంబంధించిన నామినేషన్స్ లిస్టు విడుదల చేసారు. 'మనం', 'రేసు గుర్రం' చిత్రాలు 11 నామినేషన్లతో టాప్ లో ఉన్నాయి. సినిమా పరిశ్రమకు సంబంధించి సౌత్ ఇండియాలో ఇదే అతి పెద్ద అవార్డుల కార్యక్రమం. జూన్ 18 నుండి ఓటింగ్ మొదలు అయ్యిది. ఆగస్టు 6, 7 తేదీల్లో దుబాయ్ లో అవార్డుల వేడుక జరుగనుంది.ఈ పంక్షన్ లో బాహుబలిలో విలన్ గా చేస్తున్న రానా సెంటర్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







