సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- December 17, 2025
న్యూ ఢిల్లీ: ఇటీవల సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి నెలకొన్నది. మహిళలు, పిల్లలు వీటివల్ల ఎంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీంతో కేంద్రం దీనిపై దృష్టి సారించింది. తప్పుడు సమాచారం, ఆశ్లీలత, సైబర్ నేరాలను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా, ఒటిటి ప్లాట్ ఫారమ్ లపై కఠినమైన జవాబుదారీతనాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. సురక్షితమైన, నమ్మదగిన, జవాబుదారీ ఇంటర్నెట్ ను ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రత కోసం సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐటి చట్టం 200, ఊటీ నియమాలు 2021, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం డిజిటల్ ప్లాట్ ఫారమ్ లపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిబంధనలను పాటించని వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది.
భారతదేశంలో బహిరంగ, సురక్షితమైన, విశ్వసనీయమైన సమాచారం అందించడమే తన విధానాల లక్ష్యం అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ విధానం ప్రత్యేకంగా మహిళలు, పిల్లలను ఆన్ లైన్ హాని నుండి రక్షించడంపై దృష్టి పెడుతోంది. ఇంటర్నెట్ లో చట్టవిరుద్ధమైన, అశ్లీలమైన లేదా తప్పుదారి పట్టించే కంటెంట్ ప్రసారం కాకుండా చూసుకోవడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా చట్టపరమైన, పరిపాలనాస్థాయిలో చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.ఐటీ చట్టం 2000, ఐటీ నియమాలు 2021 డిజిటల్ ప్లాట్ ఫామ్ ల బాధ్యతలను నిర్వచిస్తాయి.ఈ చట్టాలు ఆశ్లీల కంటెంట్, గోప్యతా ఉల్లంఘనలు, సైబర్ నేరాలకు శిక్షను అందిస్తాయి.పోలీసులకు దర్యాప్తు, శోధన, అరెస్టు చేయడానికి కూడా అధికారం ఉంది. ఐటీ నియమాలు 2021 చట్టవిరుద్ధమైన కంటెంట్ నేను బ్లాక్ చేయడం, తొలగించడం కంపెనీలను స్పష్టంగా ఆదేశిస్తుంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







