‘కన్నప్ప’ టీజర్ ఇప్పటికైతే ఇలా.!
- May 21, 2024
మంచు ఫ్యామిలీ ప్రెస్టీజియస్ మూవీగా రూపొందుతోన్న సినిమా ‘కన్నప్ప’. ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్‌తో ఫుల్ ప్యాక్‌డ్ భారీ కాస్టింగ్‌తో తెరకెక్కిస్తున్నారు.
అంతేకాదు, సినిమా స్టార్టింగ్ నుంచీ ఒక్కో వార్త సంచలనంగానే ప్రచారం చేస్తున్నారు. బాలీవుడ్ మొదలుకొని సౌత్‌లో అన్ని భాషల నుంచీ ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కాజల్, నయన తార, అనుష్క, ప్రబాస్, నాని తదితర టాలీవుడ్ నటీ నటులు శివ రాజ్ కుమార్, శరత్ కుమార్, తదితర తమిళ, కన్నడ నటీ నటులు బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్.. ఇలా బోలెడంత మంది స్టార్స్ ఈ సినిమాలో భాగమయ్యారు.
తాజాగా ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ కేన్స్‌లో ఘనంగా ప్రదర్శించడం జరిగింది. అలాగే ఈ నెల 30న హైద్రాబాద్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారట. ఈ ప్రదర్శన కేవలం అత్యంత సన్నిహితులు, సినీ ప్రముఖులకు మాత్రమే పరిమితం అని తెలుస్తోంది. ఆ తర్వాత జూన్ 13న అధికారికంగా టీజర్ రిలీజ్ చేస్తారట.
తాజా వార్తలు
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!