సుధీర్ బాబు మళ్లీ వెనక్కి.!
- May 21, 2024
మంచి కంటెంట్ వున్న సినిమాలను ఎంచుకుంటూ తనదైన హీరోయిజం ప్రదర్శిస్తున్నాడు సుధీర్ బాబు. అయితే, ఈ మధ్య సుధీర్ బాబు ఎంచుకుంటున్న కథలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడమే కాకుండా.. ప్రేక్షకుల్ని సైతం సరిగా ఆకట్టుకోలేకపోతున్నాయ్.
అయితే, ఈ సారి ‘హరోం హర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇదో ఢిఫరెంట్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమా మేలో రిలీజ్ కావల్సి వుండగా.. ధియేటర్ల బంద్ అనే కారణంగా పోస్ట్ పోన్ అయ్యింది.
మేలో రిలీజ్ కావల్సిన ఈ సినిమా జూన్ 14కు పోస్ట్ పోన్ అయ్యింది. ఈ సినిమాతో సుధీర్ బాబు మళ్లీ కమ్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. అయితే వాయిదాల పర్వం సినిమాపై ఆసక్తి సన్నగిల్లేలా చేస్తోంది.
ఎంత లేట్ అయినా లేటెస్ట్గా వస్తానంటున్నాడు సుధీర్ బాబు. ‘సెహరి’ అనే చిన్న సినిమాతో పాపులర్ అయిన జ్ఞాన సాగర్ ద్వారక ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మన్గా హిట్మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు







