ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్‌ సంతాపం

- May 21, 2024 , by Maagulf
ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్‌ సంతాపం

న్యూఢిల్లీ: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, అతని విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరాబ్దోల్లాహియాన్‌ ఇతర అధికారులు హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే వారి మరణానికి భారతదేశం ఒక రోజు సంతాపాన్ని పాటించడంతో మంగళవారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జాతీయ జెండాను సంగం మాస్ట్‌ వద్ద ఎగురవేశారు. కాగా, రైసీ మరణానికి భారతదేశం ఒక రోజు సంతాపాన్ని పాటిస్తుందని కేంద్ర హోంమంత్రి సోమవారం ప్రకటించారు.

మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ లు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ, హోస్సేన్ అమీర్ అబ్దొల్లాహియాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ – ఇరాన్ సంబంధాలను బలోపేతం చేయడంలో ఇరువురు నాయకులు పోషించిన ముఖ్యమైన పాత్రను వారు తమ సందేశాలలో పేర్కొన్నారు. రైసీ, అమీరాబ్దోల్లాహియాన్, ఇతరులు అజర్బైజాన్ సరిహద్దును సందర్శించిన తరువాత ఇరాన్ కు వెళ్తుండగా., అక్కడ వారు ఆనకట్ట ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు వారి హెలికాప్టర్ వాయువ్య ఇరాన్లోని జోల్ఫాలోని పర్వత ప్రాంతంలో కూలిపోయింది. వర్షం, పొగమంచు మధ్య గంటల తరబడి సెర్చ్ ఆపరేషన్ తరువాత రెస్క్యూ బృందాలు క్రాష్ సైట్ దగ్గరికి వెళ్లి అక్కడ కనిపించకపోవడంతో హెలికాప్టర్లో ఉన్న వారందరూ చనిపోయినట్లు ప్రకటించారు.

అంతేకాక రైసీ, ఇతరులను కోల్పోయినందుకు సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, వారి విషాదకర మరణంతో తాను బాధపడ్డానని, దిగ్భ్రాంతికి గురయ్యానని, ఈ విషాద సమయంలో భారతదేశం ఇరాన్ కు మద్దతుగా నిలుస్తుందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com