మష్రూమ్ కబాబ్
- July 02, 2015
కావలిసినవి
మష్రూమ్స్ - 100గ్రా
బంగాళా దుంపలు - రెండు
గరం మసాలా - ఒక చెంచా
పన్నీర్ - 50గ్రా
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
జీలకర్ర పొడి - అర టీ స్పూను
నూనె - తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ ` ఒక చెంచా
తయారీ
పుట్టగొడుగుల్ని, బంగాళాదుంపల్ని ఉడికించి పక్కన ఉంచాలి.పన్నీర్‌ను సన్నగా తురిమి ఉంచాలి. ఇప్పుడు ఒక బాణలిలోకి నూనె వేసి దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పొడుగ్గా కోసిన వచ్చిమిర్చి ముక్కలు, అల్లం,వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత దానిలో ఉడికించిన మష్రూమ్ ముక్కలు కూడా వేసి తగినంత ఉప్పు వేసి దించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి దానికి ఉడికించి మెదిపిన బంగాళాదుంప ముక్కలను కూడా కలిపి పన్నీర్, గరంమసాలా పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరచేతిలోకి తీసుకుని చిన్న చిన్న అప్పాల్లా ఒత్తుకుని పెనం మీద నూనె వేసి బ్రౌన్ రంగులోకి వచ్చేవరకూ కాల్చి తీయాలి. మష్రూమ్ కబాబ్ రెడీ.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







