హాస్పటల్ లో చేరిన షారుఖ్
- May 23, 2024
అహ్మదాబాద్: కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హాస్పటల్ లో చేరిన విషయం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో 2024 ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. షారుక్ సొంత ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్‌లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో తన జట్టును ప్రోత్సహించేందుకు షారుక్ ఫ్యామిలీతో సహా అహ్మదాబాద్ వెళ్లారు. రెండు రోజులుగా వాతావరణంలో ఉష్ణోగ్రత కారణంగా ఆయన డిహైడ్రేషన్‌తో అస్వస్థతకు గురైనట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో స్థానిక కేడీ హాస్పిటల్లో చేరిన బాద్షా చికిత్స అనంతరం డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ‘షారుక్ ఖాన్ హీట్ స్ట్రోక్ కారణంగా ఆయన అస్వస్థకు గురయ్యారు. కేడీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి, ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్డి అయ్యారు’ అని అహ్మదాబాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఓం ప్రకాశ్ జత్ పేర్కొన్నారు.
కాగా, షారుక్ గతేడాది హ్యాట్రిక్ హిట్లను అందుకున్నారు. పఠాన్, జవాన్‌తో చెరో రూ.1000 కోట్ల సాధించిన ఆయన డంకీ మరో రూ.500కోట్ల వరకు వసూలు చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన మరో సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. కానీ కింగ్ అనే సినిమా చేస్తున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంతోనే షారుక్ కూతురు సుహానా ఖాన్ కూడా వెండితెర అరంగేట్రం చేయనుందని తెలిసింది. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరూధ్ మ్యూజిక్ అందిస్తున్నారట. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్పై సిద్ధార్థ్ ఆనంద్‌తో కలిసి షారుక్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







