తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన..
- May 23, 2024
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
కాగా, నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయి. అవి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో మరి కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించనున్నాయి. వచ్చే నెల 8 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి.
ఎండాకాలం ముగియకముందే జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతుంటే, మరికొన్ని ప్రాంతాల వారు వానల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు కూడా ఈ సారి త్వరగా వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?







