ఓటీపీ ఫ్రాడ్..OMR 10,000 కోల్పోయిన మహిళ

- May 24, 2024 , by Maagulf
ఓటీపీ ఫ్రాడ్..OMR 10,000 కోల్పోయిన మహిళ

మస్కట్: బ్యాంక్ ఉద్యోగి పేరిట మహిళను మోసం చేసిన ఘటన చోటుచేసుకుంది. బ్యాంకు ఉద్యోగి అని చెప్పి బాధిత మహిళ నుంచి వన్ టైమ్ పిన్ (OTP) తెలుసుకొని, వారి అకౌంట్ నుంచి OMR 10,000 విత్‌డ్రా చేసుకున్నాడని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. “బ్యాంక్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు నమ్మించి ఒక మహిళను మోసం చేసినందుకు ఆసియా జాతీయతకు చెందిన వ్యక్తిని అల్ ధాహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. అతను తన సమాచారాన్ని బ్యాంక్‌తో అప్‌డేట్ చేయమని మరియు అతనికి OTPని చెప్పాలని కోరాడు. అతడి మాటలను నమ్మిన బాధిత మహిళ ఓటీపీ చెప్పగానే, ఆమె అకౌంట్ నుంచి OMR 10,000 కంటే ఎక్కువ మొత్తం విత్‌డ్రా అయింది." అని పోలీసులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com