TGSRTC నకిలీ లోగో..ఇద్దరి పై కేసు నమోదు
- May 24, 2024
హైదరాబాద్: టీజీఎస్‌ఆర్టీసీ నకిలీ లోగోను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొంతం దిలీప్, హరీష్ రెడ్డిలపై ఐపీసీ, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. టీజీఎస్‌ఆర్‌టీసీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిందితులు పోస్టులు పెడుతున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో అంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఆ లోగోతో కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని సజ్జనర్ తెలిపారు. ఇప్పటివరకు కొత్త లోగోను అధికారికంగా విడుదల చేయలేదని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
తాజా వార్తలు
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!







