హైదరాబాద్ నగర వాసులకు మెట్రో గుడ్ న్యూస్..
- May 24, 2024
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ లో స్వల్ప మార్పులు చేసింది. ఇప్పటివరకు శుక్రవారం రాత్రి 11 గంటల వరకే మెట్రో నడువగా..ఇక నుండి ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసు పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 AM గంటల నుంచే రైళ్లు నడవనున్నట్లు తెలిపింది. మిగిలిన రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనుంది. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది.
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ప్రతి శుక్రవారం మెట్రో ప్రయాణ వేళలను పొడిగించినట్లు తెలిపింది. పొడిగించిన సర్వీస్ వేళలతో లేట్ మీటింగ్స్, ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు ఇక మీకు అడ్డుండవు … మీ బ్యాగ్‌లను ప్యాక్ చేసి మెట్రో ఎక్కండని ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







