బునియాది తొలి నగ్న రెస్టారెంట్!
- June 09, 2016
బాహ్య ప్రపంచపు కట్టుబాట్లను కాసేపు పక్కనబెట్టి ఎంచక్కా నచ్చినట్లు నగ్నంగా రెస్టారెంట్లో గడపాలనుకునే వారికి స్వర్గధామంలాంటి రెస్టారెంట్ ఒకటి లండన్‌లో ప్రారంభానికి సిద్ధమైంది. 'ది బునియాది(పునాది)గా పిలిచే ఈ రెస్టారెంట్లో తప్పదనుకుంటే పొదుపుగా దుస్తులను వేసుకున్న వారికీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శాఖాహార, మాంసాహార వంటలను మట్టికుండల్లో, 'తినగల' చెంచాలతో వడ్డిస్తారు. ఈ చెంచాలను ఆహారపదార్ధాలతో తయారుచేస్తారు. రసాయనాలులేని వంటలు ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. ఇప్పటికే రెస్టారెంట్‌కు వెయిటింగ్ లిస్ట్ ఏకంగా 44,200కు చేరింది. .రెస్టారెంట్లో ఒకేసారి కేవలం 42 మంది మాత్రమే కూర్చునే సదుపాయం ఉంది.
విద్యుత్, ఫోన్, దుస్తులు ఇలా ఎలాంటివి లేని ప్రపంచాన్ని పరిచయం చేయడం కోసం ఈ రెస్టారెంట్‌ను నెలకొల్పినట్లు రెస్టారెంట్ మాతృసంస్థ అయిన 'లాలీపాప్' వ్యవస్థాపకుడు సెబ్ లేయాల్ ప్రకటించారు. శనివారం ప్రారంభంకానున్న ఈ రెస్టారెంట్లో పూర్తి నగ్నంగా ఉండే కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా ఇంటీరియర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కొవ్వొత్తుల కాంతుల్లో.. వెదురుకర్రలతో చేసిన ఏర్పాట్లు రెస్టారెంట్‌కు కొత్త శోభను తెస్తాయన్నారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







