3 హస్కీల పై దాడి చేసిన విషపూరిత వైపర్..!
- May 26, 2024
యూఏఈ: శుక్రవారం తెల్లవారుజామున ఉమ్ అల్ క్వైన్‌లోని స్ట్రే డాగ్స్ సెంటర్ కేర్‌టేకర్ షెల్టర్‌లోని ఒక విభాగంలోకి ప్రవేశించిన ఓ విషపూరిత వైపర్ అక్కడ 3 హస్కీలను కాటు వేసింది. "మా అభయారణ్యం ప్రాంతంలో మా మూడు హస్కీలను పాము కరిచింది. ఇక్కడ స్వచ్ఛమైన జాతికి చెందిన కుక్కలు ప్రతిరోజూ స్వేచ్ఛగా పరిగెత్తుతాయి" అని స్ట్రే డాగ్స్ సెంటర్ వ్యవస్థాపకుడు అమీరా విలియం చెప్పారు. ఆ సమయంలో, ఏడు కుక్కలు ఆ విభాగంలో ఉన్నాయని తెలిపారు.
అయితే పాముకరిచిన 30 నిమిషాల్లో బ్రిటిష్ వెటర్నరీ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. వైపర్ ఫోటో మరియు వీడియోను చూస్తే, అది ఆడ అరేబియా కొమ్ముల వైపర్ ( సెరాస్టెస్ గ్యాస్పెరెట్టి ) అని ఒక నిపుణుడు వెల్లడించాడు. ఈ వైపర్లు విషపూరితమైనవి మరియు మానవులకు గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తాయని తెలిపారు. కాగా యూఏఈ అనేక వైపర్ జాతులకు నిలయంగా ఉంది. వీటిలో అరేబియన్ కొమ్ముల వైపర్ (సెరాస్టెస్ గ్యాస్పెరెట్టి), రంపపు స్కేల్డ్ వైపర్ (ఎచిస్ కారినాటస్) ఉన్నాయి. వైపర్లతో పాటు సాండ్ బోవా (ఎరిక్స్ జయకరి), స్కోకరి సాండ్ రేసర్ (ప్సామ్మోఫిస్ స్కోకరి), ఎడారి ఫాల్స్ కోబ్రా (మాల్పోలోన్ మొయిలెన్సిస్) వంటి అనేక ఇతర స్నెక్స్ తరచూ కనిపిస్తాయని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







