2027లో 11వ వరల్డ్ వాటర్ ఫోరమ్‌కు సౌదీ ఆతిథ్యం
- May 26, 2024
జకార్తా: 2027లో జరిగే 11వ వరల్డ్ వాటర్ ఫోరమ్‌కు సౌదీ అరేబియా హోస్ట్‌గా ఎంపికైంది. ఇండోనేషియాలో జరిగిన ఫోరమ్ 10వ సెషన్ ముగింపు కార్యక్రమంలో వివిధ అంతర్జాతీయ సంస్థలతో పాటు 160 దేశాలకు చెందిన దేశాధినేతలు, మంత్రులు, అధికారులు హాజరైన సందర్భంగా ఈ మేరకు ప్రకటించారు. రాబోయే ఫోరమ్ "యాక్షన్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్" అనే థీమ్‌తో ప్రపంచ నీటి సమస్యలపై చర్చించనున్నారు. అవకాశం ఇచ్చినందుకు పర్యావరణ, నీరు మరియు వ్యవసాయ మంత్రి ఇంజనీర్ అబ్దుల్‌రహ్మాన్ అల్-ఫద్లీ కృతజ్ఞతలు తెలిపారు. వాటర్ డొమైన్‌లో సౌదీ అరేబియా యొక్క అంతర్జాతీయ స్థితిని బలోపేతం చేయడంలో ఈ మద్దతు కీలకమైందని, ఈ ముఖ్యమైన ప్రపంచ ఈవెంట్‌ను నిర్వహించే ప్రత్యేకతను సాధించిపెట్టిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







