వాహనంలో అసభ్యకర చర్యలు.. డ్రైవర్, ప్రయాణికులు అరెస్ట్

- May 26, 2024 , by Maagulf
వాహనంలో అసభ్యకర చర్యలు.. డ్రైవర్, ప్రయాణికులు అరెస్ట్

బహ్రెయిన్: వాహనం లోపల మరియు వెలుపల అసభ్యకర చర్యలను చిత్రీకరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో నలుగురు వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అదుపులోకి తీసుకుంది. ఈ వీడియో పబ్లిక్ మర్యాదను ఉల్లంఘించడంతోపాటు రహదారి భద్రతను ముగ్గురు యువతులు ఉల్లంఘించారని తెలిపింది.  పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకారం,  వైరల్ అవుతున్న వీడియో ఉన్న వారిని వేగంగా గుర్తించారు. వారందరిని అరెస్ట్ చేశారు.  తన వాహనంలో మహిళలను అసభ్యకరంగా ప్రవర్తించేలా అనుమతించడం ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినట్లు డ్రైవర్ అంగీకరించాడు. ముగ్గురు మహిళలు కూడా బహిరంగంగా అసభ్యకర చర్యలకు పాల్పడినట్టు అంగీకరించారు. వ్యక్తులను క్రిమినల్ కోర్టుకు రిఫెరల్ చేసే వరకు విచారణకు ముందు నిర్బంధంలో ఉంచారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com