ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించిన సౌదీ
- May 28, 2024
రియాద్: గాజా స్ట్రిప్‌లో నిరాయుధులైన పౌరులపై ఇజ్రాయెల్ ఆక్రమణ దళాల నిరంతర దాడులను సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ (UNRWA) గోడన్లకు సమీపంలో, రఫాకు వాయువ్యంగా ఉన్న పాలస్తీనియన్ల గుడారాలను లక్ష్యంగా జరిగిన దాడులను ఖండించింది. అంతర్జాతీయ మరియు మానవతా చట్టాలు, నిబంధనలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైన్యం నిరంతరం తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపించింది . పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న మానవతా విపత్తును పరిష్కరించడానికి తక్షణం అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చింది. తాజా దాడుల్లో పిల్లలు మరియు మహిళలు సహా కనీసం 35 మంది మరిణించినట్లు, అనేక మంది గాయపడ్డట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







