కొత్త హజ్, ఉమ్రా రూల్స్.. ఉల్లంఘనలకు Dh50,000 వరకు జరిమానా
- May 28, 2024
యూఏఈ: ఇస్లామిక్ అఫైర్స్ మరియు ఎండోమెంట్స్ జనరల్ అథారిటీ నుండి ముందస్తు అనుమతి లేకుండా యూఏఈలోని ఆపరేటర్లు హజ్ లేదా ఉమ్రా కోసం దరఖాస్తులు లేదా అభ్యర్థనలను స్వీకరించలేరు. ఈ మేరకు అథారిటీ ప్రకటించింది. సేవలను దుర్వినియోగం చేస్తే భారీ జరిమానాలను అధికార యంత్రాంగం ప్రకటించింది. వ్యక్తులు, ప్రచార నిర్వాహకులు మరియు కార్యాలయాలు చట్టాన్ని ఉల్లంఘనకు పాల్పడితే 50,000 దిర్హామ్ల వరకు జరిమానా విధించనున్నారు. ఆపరేటర్లు హజ్ లేదా ఉమ్రా ట్రిప్లను నిర్వహించడానికి లేదా ప్రచారం చేయడానికి ముందు అధికారుల నుండి తప్పనిసరిగా అనుమతి పొందవలసి ఉంటుంది. దీనితోపాటు లైసెన్స్ లేకుండా తీర్థయాత్ర కోసం విరాళాలు సేకరించడం లేదా స్వీకరించడాన్ని నిషేధించారు. కొత్త రూల్స్ ను దేశంలోని లైసెన్స్ పొందిన ఆపరేటర్లు స్వాగతించారు. కఠినమైన జరిమానా చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







