ప్రేమం లో ముఖ్య పాత్ర పోషించనున్న వెంకీ
- June 10, 2016టాలీవుడ్ హీరోల్లో అత్యంత సక్సెస్ ఫుల్ కెరీర్ గ్రాఫ్ ఎవరిది అంటే విక్టరీ వెంకటేష్ పేరే చెప్పాలి. సినిమాలో కథ తప్ప మిగిలినవన్నీ సెకండరీయే అని ఆయన భావిస్తారు. అందుకే ఆయన ట్రాక్ రికార్డ్ ఆ రేంజ్ లో ఉంది. అయితే ఇప్పటి వరకూ అతిథి పాత్రలో చేయని వెంకీ, ప్రేమమ్ లో ఒక ముఖ్య పాత్రలో కాసేపు కనిపిస్తారని వార్తలు వచ్చాయి.ఇప్పటి వరకూ ఎవరూ ఖరారు చేయనప్పటికీ, మేనల్లుడి కోసం వెంకీ ఒప్పుకోక తప్పలేదని సమాచారం.మళయాళ ప్రేమమ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ప్రేమమ్ లో హీరో పాత్రతో మంచి అనుబంధం ఉన్న ఒక కీలక పాత్రను వెంకీ పోషించారట. ఇప్పటికే షూటింగ్ కూడా అయిపోయిందని అంటున్నారు సినీజనాలు.అయితే అసలు విషయాన్ని మూవీ టీం ప్రకటిస్తే తప్ప తెలీదు.ఒక వేళ ఈ వార్తలు నిజమైతే మాత్రం, అక్కినేని దగ్గుబాటి ఫ్యాన్స్ కు పండగే. వెంకీ విషయానికొస్తే, తన బాబు బంగారం సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మధ్యే రిలీజ్ చేసిన మూవీ టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ లభించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత