అమెజాన్‌లో అదరగొడుతున్న కృష్ణమ్మ ...
- May 29, 2024
హైదరాబాద్: వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కంచర్ల తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను వి.వి.గోపాలకృష్ణ తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ బూరుగుల, లక్ష్మణ్ మీసాల, నంద గోపాల్, హరిబాబు కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం 240దేశాలకు పైగా అమెజాన్ ప్రైమ్‌లో ‘కృష్ణమ్మ’ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
కృష్ణా నది ఒడ్డున ఉండే విజయవాడ పట్టణంలో ముగ్గురు అనాథలు శివ(కృష్ణ), భద్ర (సత్యదేవ్), కోటి (లక్ష్మణ్ మీసాల) పెరిగి పెద్దవుతారు. వీరి మధ్య చక్కటి అనుబంధం ఉంటుంది. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాల్లో ఓ ఘటన కారణంగా అనుకోని సమస్యలు ఎదురవుతాయి. జీవితాలు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. చిన్నతనంలో జైలుకి వెళ్లిన శివ, అక్కడి నుంచి వచ్చాక నిజాయతీగా జీవితాన్ని వెల్లదీయాలనుకుంటాడు. ముగ్గురి స్నేహితుల్లో భద్ర, కోటిలకు డబ్బులు అవసరం అవుతాయి. దాంతో వాళ్లు గంజాయి స్మగ్లింగ్ చేయాలనుకుని పోలీసులకు చిక్కుతారు. అదే సమయంలో ఓ ప్రమాదకరమైన పని చేయటానికి సిద్ధమవుతారు. దీని కారణంగా వాళ్ల జీవితాల్లో ఊహించని ఘటనలు ఎదురవుతాయి. ఆ పర్యావసానాలను వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు.. చివరకు ఏమైందనేదే కృష్ణమ్మ సినిమా.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







