సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించిన ఫైజర్-యశోద హాస్పిటల్స్
- May 29, 2024
హైదరాబాద్: హైదరాబాదులోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అడల్ట్ వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ)ని ప్రారంభించేందుకు ఫైజర్ ఇండియా, యశోద హాస్పిటల్స్ భాగస్వామ్యం చేసుకున్నాయి. రోగుల సంరక్షణను మెరుగు పరచాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ సిఓఈ ను సమాజం అంతటా వయోజన టీకా సంపూర్ణ కవరేజీని నిర్ధారించడానికి తీర్చిదిద్దారు.
ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ…. యశోద హాస్పిటల్స్ వద్ద తాము వ్యాధి నివారణ, టీకాలు వేయడంలో ముందంజలో ఉండటానికి ప్రయత్నిస్తున్నామన్నారు. టీకాలు వేయించుకోవటం కీలకం. అది బాల్యంలో మాత్రమే కాదు, ఒక వ్యక్తి జీవితాంతం తప్పనిసరన్నారు. మరీ ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు, వృద్ధులతో సహా రోగ నిరోధక శక్తి తక్కువగా వున్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
ఫైజర్ వ్యాక్సిన్స్ డైరెక్టర్ మెడికల్ అఫైర్స్ డాక్టర్ సంతోష్ టౌర్ మాట్లాడుతూ…. వ్యాక్సిన్ సైన్స్, వైద్య అభివృద్ధి పరంగా దశాబ్దాల నైపుణ్యంతో, ఇన్‌ఫెక్షన్ నుండి సమాజాన్ని రక్షించడానికి, ప్రజారోగ్యాన్ని మెరుగు పరచడానికి వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం ముఖ్యమనే తమ నిబద్ధత పట్ల ఫైజర్ స్థిరంగా ఉందన్నారు. నివారణ ఆరోగ్యానికి నాయకత్వం వహించడంపై దృష్టి సారించి, యశోద హాస్పిటల్స్‌తో తమ భాగస్వామ్యం ప్రబలంగా ఉన్న వ్యాక్సిన్-నివారించగల వ్యాధుల నుండి ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధుల నుండి సమర్థవంతమైన రక్షణను నిర్ధారించడానికి పెద్దలకు వ్యాక్సినేషన్‌ను విస్తరించే లక్ష్యం పునరుద్ఘాటిస్తుందన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!