కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

- May 30, 2024 , by Maagulf
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

తిరువనంతపురం: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని, ఈశాన్య ప్రాంతాలను తాకాయి. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వర్షాకాలం ప్రారంభమైందని భావిస్తారు. రానున్న 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ అంచనా వేసిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే కేరళను తాకాయి నైరుతి రుతుపవనాలు.

తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది.

కాగా, నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1-4 మధ్య కేరళ తీరాన్ని తాకుతాయి. ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com