కువైట్ లో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ ఇండెక్స్
- May 31, 2024
కువైట్: కువైట్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. బుధవారం ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో.. ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్ కొత్త గరిష్టాన్ని నమోదు చేసి15,411 మెగావాట్లకు చేరుకుంది.ఇది ఆరెంజ్ లైన్‌ను సూచిస్తుందని అధికారులు తెలిపారు. నివేదికల ప్రకారం, ప్రస్తుత వేసవిలో లోడ్లు 17,600 మెగావాట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. పీక్ పీరియడ్‌లో ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నట్లు విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటుందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో, రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం కొత్త రికార్డులు నమోదు చేస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







