ఈ-సిగరెట్ వినియోగం పై యూఏఈ హెచ్చరిక
- May 31, 2024
యూఏఈ: సాంప్రదాయ సిగరెట్లకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలుగా ఎలక్ట్రానిక్ ధూమపాన ఉత్పత్తులను ప్రచారం చేయడంపై యూఏఈని ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. ఇలాంటి ప్రచారాలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ (మోహాప్) తెలిపింది. మే 31న ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ధూమపానం మానేయాలని కోరింది. హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, మధుమేహం మరియు మానసిక ఆరోగ్య సమస్యల వంటి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాల గురించి హెచ్చరించింది. పొగాకు సిగరెట్ల వలే నికోటిన్ ఉత్పత్తులు కూడా సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక నివేదికలో పేర్కొంది. నికోటిన్‌తో కూడిన ఇ-సిగరెట్లు ఆరోగ్యానికి హానికరమని,ఇవి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు చూపుతాయని, అవి కొన్ని రకాల విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయని నిర్ధారించబడిందని తెలిపింది. వాటిలో కొన్ని క్యాన్సర్‌కు కారణమవుతాయని, అదే సమయంలో కొన్ని గుండె మరియు ఊపిరితిత్తుల రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరించింది. ఇ-సిగరెట్‌ల వాడకం మెదడు అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొంది. యూఏఈ చట్టాల ప్రకారం, దేశవ్యాప్తంగా కార్యాలయాలు మరియు క్లోజ్డ్ ప్రదేశాలలో ఈ-సిగరెట్లు తాగడంపై నిషేధం ఉంది. సిగరెట్ చట్టాలు ఇ-సిగరెట్‌లకు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







