TGSRTC ప్రయాణికులకు శుభవార్త...
- June 01, 2024
హైదరాబాద్: హైదరాబాద్ నగర వాసులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్-సికింద్రాబాద్ మార్గం (రూట్ నెంబర్ 24 ఈ)లో 8 కొత్త మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. సోమవారం నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ బస్సులు ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్ నుంచి ఏఎస్రావు నగర్, సైనిక్‌పురి, అమ్ముగూడ, లాల్‌బజార్, కర్జన, జేబీఎస్ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటాయని పేర్కొన్నారు. తిరిగి అదే మార్గంలో ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్‌కు వెళ్తాయన్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఈ సర్వీసులను వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుకుంటోందని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







