ఏపీలో కౌంటింగ్‌కు సర్వంసిద్దం..
- June 03, 2024
అమరావతి: ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. మరికొద్ది గంటల్లో ఏపీలోని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కు అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని నిర్థాక్షణ్యంగా బయటకు పంపడమే కాకుండా చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నిజిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. కౌంటింగ్ రోజు, తరువాత రోజుల్లో శాంతి భద్రతలు అదుపులో ఉండేలా, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతవాతావరణంలో పూర్తయ్యేలా ముందస్తు జాగ్రత్తలుపై అధికారుల దృష్టి కేంద్రీకరించారు.
తొలుత పోస్టల్ బ్యాలెట్, ఆ తరువాత ఈవీఎంల కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజంట్ ను నియమించుకునేందుకు, ఆర్వో టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఒక ఏజంట్ కు అవకాశం ఉంటుంది. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజంట్ చేతిలో ఫారం-17సి, పెన్ను లేదా పెన్సిల్, ప్లైయిన్ పేపర్ మాత్రమే ఉండేలా చూడాలని ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. ఓట్ల లెక్కింపు కేంద్రాలన్నీ ఫైర్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, అందుకు తగ్గట్టుగా అగ్నిమాపక శాఖ నుండి దృవీకరణ పత్రాన్ని తప్పని సరిగా పొందాలని ఈసీ సూచించింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!