T20 అమెరికా: భారత్ దూకుడు..ఐర్లాండ్ పై గ్రేట్ విక్టరీ
- June 06, 2024
అమెరికా: టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్ 5) న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా దూకుడు కనబరిచింది. తొలుత టాస్ గెలిచిన భారత్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని ఐర్లాండ్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, ఐర్లాండ్ జట్టు కేవలం 16 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇందులో భారత పేసర్లు చెలరేగిపోయారు.
ఇక. 97 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగన భారత జట్టులో విరాట్, రోహిత్ ఓపెనర్లుగా వచ్చారు. కాగా, ఒకే ఒక్క పరుగు చేసి కోహ్లీ లాంగాఫ్ మీదుగా సిక్స్ బాదబోయి క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు.ఆ తర్వాత రోహిత్‌కు జతగా రిషబ్ పంత్ జత అయ్యాడు. ఇద్దరూ కలిసి దూడుకు మీదుండగా.. కెప్టెన్ రోహిత్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతలోనే ఓ బంతి రోహిత్ మోచితికి తాకడంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో సూర్యకుమార్ వచ్చి రెండు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత శివమ్ దూబేతో కలిసి పంత్ బౌండరీలు బాది ఆట ముగించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 52, కోహ్లీ (1), రిషబ్ పంత్ 36, సూర్యకుమార్ (2), శివమ్ దూబె 0.. పరుగులు సాధించారు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.. కాగా, ఐర్లాండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా చాలాకాలం తర్వాత బంతితో ఇరగదీశాడు. మూడు వికెట్లు తీసి భేష్ అనిపించుకున్నాడు.
ఇక.. హార్దిక్ దాటికి ఐర్లాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. హార్దిక్ 4 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ ఉంది. హార్దిక్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్ (3-0-18-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (2-1-4-1), అక్షర్ పటేల్ (0.2-0-1-1) కూడా విజృంభించడంతో ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది.
ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), లోర్కాన్ టక్కర్ (10), హ్యారీ టెక్టార్ (4), కర్టిస్ క్యాంపర్ (12), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







