లోక్‌సభలో ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ!
- June 06, 2024
న్యూ ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షనేతగా ఉండాలని రాహుల్‌ను కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. మొన్నటిదాకా ప్రతిపక్షనేతగా అధిర్ రంజన్‌చౌదరి ఉన్న విషయం తెలిసిందే. కాగా లోక్ సభ ఎన్నికల్లో అధిర్ రంజన్ చౌదరి ఓటమి చెందడంతో తెరపైకి రాహుల్ పేరు వచ్చింది. ప్రతిపక్షనేతగా ఉంటే రాహుల్ ఇమేజ్ మరింత పెరుగుతుందనే యోచనలో కాంగ్రెస్ ఉంది.
మరి దీనిపై రాహుల్ గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 99 సీట్లతో రెండో పెద్దపార్టీగా అవతరించి ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ పార్టీ సాధించింది. లోక్ సభ ఎన్నికల్లో రెండు స్థానాలు వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి బంపర్ మెజారిటీతో రాహుల్ గెలిచిన విషయం తెలిసిందే. భారత్‌జోడో యాత్ర తర్వాత దేశంలో రాహుల్ ఇమేజ్ భారీగా పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







