నవదీప్.. మరో ‘అర్జున్ రెడ్డి’ కానున్నాడా.?

- June 06, 2024 , by Maagulf
నవదీప్.. మరో ‘అర్జున్ రెడ్డి’ కానున్నాడా.?

యంగ్ హీరో నవదీప్‌కి సరైన హిట్టు పడడం లేదు. మంచి విషయమున్న హీరోనే అయినప్పటికీ హీరో స్టేజ్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిలైన పరిస్థితులు. ఇలాంటి టైమ్‌లో నవదీప్ హీరోగా ఓ అరుదైన మూవీ తెరకెక్కింది అదే ‘లవ్ మౌళి’.

కొత్త దర్శకుడు అనీంద్ర ఈ సినిమాని తెరకెక్కించాడు. ప్రచార చిత్రాలు చాలా బోల్డ్‌గా వున్నాయ్. యూత్ ప్రధానాంశంగా రూపొందిన సినిమాలా ప్రొజెక్ట్ అవుతోంది.

సినిమా నిండా బోల్డ్ కంటెంట్, లిప్ లాక్స్.. ఇలాంటివి పుష్కలంగా వుందంటూ డైరెక్టర్ బోల్డ్‌గానే చెప్పేస్తున్నాడు. అలాగని అడల్డ్ మూవీ లిస్టులోకి ఈ సినిమా వెళ్లదని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు.

కథకి అవన్నీ ఖచ్చితంగా అవసరమయ్యాయ్ కాబట్టే పెట్టామని అంటున్నాడు. ఇన్నర్ వేర్స్‌లో మందు పోసుకుని తాగే క్యారెక్టర్ హీరోది. అలాగే పొడుగాటి జుట్టు, కండలు తిరిగిన శరీరం చాలా అంటే చాలా రగ్గ్‌డ్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు నవదీప్ ఈ సినిమాలో.

అయితే, సినిమా అందరికీ బాగా నచ్చుతుందని ఓ మంచి మెసేజ్‌ని ఈ సినిమా ద్వారా ఇవ్వాలనుకున్నాననీ డైరెక్టర్ చెబుతున్నాడు. అంతేకాదు, ఆల్రెడీ కొన్ని స్పెషల్ ప్రీమియర్ షోల ద్వారా అందిన టాక్ ప్రకారం నిజంగానే సినిమా బాగుందని అంటున్నారు. చూడాలి మరి, ‘అర్జున్ రెడ్డి’ టైప్‌లో ‘లవ్ మౌళి’ హిట్ కొడుతుందేమో. అలాగైతే నవదీప్‌కి ఇన్నాళ్లకి బ్రేక్ వచ్చినట్లే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com