‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3’ లాంచింగ్ ప్రోమో..
- June 06, 2024
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, ప్రేమికుల నుంచి ప్రశంసలు పొందిన సింగింగ్ రియాలిటీ షో ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’. ఇప్పటికే రెండు సీజన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మూడో సీజన్‌కు సిద్ధమైంది. 37 దేశాల్లో 1500 పైగా ఆడిషన్స్ ను నిర్వహించి కంటెస్టెంట్లను సెలక్ట్ చేసింది.
హోస్ట్‌గా శ్రీరామ చంద్ర ఉండగా సంగీత దిగ్గజాలైన ఎస్.ఎస్.తమన్, గీతామాధురి, కార్తీక్ లు న్యాయ నిర్ణేతల బృందంలో ఉన్నారు. మూడో సీజన్ జూన్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ లాంఛింగ్ ప్రొమోను విడుదల చేశారు. ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సంగీత స్వర సాగరంలో మునిగిపోవటానికి ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తొలి సీజన్లో నెల్లూరుకు చెందిన వాగ్దేవి విజేతగా గెలవగా, రెండో సీజన్లో న్యూజెర్సీకి చెందిన శృతి నండూరి గెలిచింది. మరీ మూడో సీజన్లో ఎవరు విజేతగా నిలుస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







