రామోజీగ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు కన్నుమూత..
- June 08, 2024
హైదరాబాద్: ఈనాడు సంస్థల అధినేత, రామోజీ గ్రూప్ ఛైర్మన్ చెరుకూరి రామోజీ రావు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం రామోజీ రావు తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. వెంటనే ఆయనను హైదరాబాద్ శివారులో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ రావు నివాసం నుంచి.. నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఆయనకి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితం కన్నుమూసారు. ఆయన పార్ధివ దేహాన్ని ఫిలింసిటీలోని నివాసానికి తరలించనున్నారు. రామోజీరావు కన్నుమూసారన్న వార్తతో ప్రతి ఒక్కరు దిగ్భ్రాంతి చెందుతున్నారు.ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







