బంగ్లాదేశ్ లో ఉగ్రవాదం పై పోరు
- June 11, 2016
లౌకికవాద ఉద్యమకారులపైనా, మైనార్టీలపైనా ఇటీవల బంగ్లాదేశ్‌లో దాడులు, హత్యలు పెచ్చరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక డ్రైవ్‌ని ప్రారంభించారు. ఆ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 1,700 మందిని అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు. వారిలో నిషేధిత ఉగ్రవాద గ్రూపులకు చెందిన వారు కూడా కొంత మంది ఉన్నారని చెప్పారు. గురువారం సమావేశమైన పోలీసు ఉన్నతాధికారులంతా ఉగ్రవాద వ్యతిరేక డ్రైవ్ నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. ఒక వారం పాటు ఈ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
అయితే శుక్రవారం ఒక్కరోజే బంగ్లాదేశ్ దేశ వ్యాప్తంగా 1,600 మందిని పట్టుకున్నామని చెప్పారు. శనివారం మరో 140 మంది వరకు దొరికారని తెలిపారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 1,740 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అక్కడి రాజసాహి జిల్లా నుంచి 88 మందిని అదుపులోకి తీసుకుంటే వారిలో తొమ్మిది మంది ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించామన్నారు. వారిలో ఎనిమిది మంది జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ)కి చెందిన వారు కాగా మరొకరు జాగ్రతా ముస్లిం జనత బంగ్లాదేశ్(జేఎంజేబీ)కి చెందిన వారని చెప్పారు.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









