మోడీ కేబినెట్ 3.o: కేంద్రంలో మంత్రులకు శాఖల కేటాయింపు..
- June 10, 2024
న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీతో పాటు 72 మంది ఎన్డీయే ఎంపీలు మంత్రులు, రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రుల కేటాయింపుపై రాజకీయ వర్గాల్లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరికి ఏ శాఖ ఇచ్చారు? దీనిపై ఆసక్తి కలిగింది. అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మోదీ ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించింది. అయితే, ఈ కేటాయింపు అధికారికంగా ప్రకటించలేదు.
కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు...
- రాజ్‌నాథ్ -రక్షణశాఖ
- అమిత్ షా – హోమ్ శాఖ
- నిర్మలా సీతారామన్- ఆర్థికశాఖ
- నితిన్ గడ్కరీ -రవాణాశాఖ
- జేపీ నడ్డా -ఆరోగ్య శాఖ
- జైశంకర్ – విదేశాంగశాఖ
- మనోహర్‌లాల్ ఖట్టర్-గృహ నిర్మాణశాఖ, పట్టణాభివృద్ధి
- శివరాజ్‌సింగ్ చౌహాన్ – వ్యవసాయశాఖ
- అశ్వినివైష్ణవ్ -సమాచారశాఖ, రైల్వే శాఖ
- జితన్ రామ్ మాంఝీ -ఎంఎస్ఎంఈ
- అజయ్, హర్ష్ మల్హోత్రా -రవాణాశాఖ సహాయ మంత్రులుగా
- శ్రీపాదనాయక్ -పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి
- సీఆర్ పాటిల్ – జలశక్తి శాఖ
- రామ్మోహన్ నాయుడు – పౌర విమానయాన శాఖ
- గజేంద్ర సింగ్ షెకావత్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ
- ధర్మేంద్ర ప్రధాన్ – విద్యాశాఖ
- కిరెన్ రిజిజు – పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
- చిరాగ్ పాశ్వాన్ – క్రీడా శాఖ
- సురేష్ గోపి, రావ్ ఇందర్జీత్ సింగ్ (సహాయ మంత్రులు)
- హర్దీప్ సింగ్ పూరి – పెట్రోలియంశాఖ
- శ్రీపాద నాయక్ – విద్యుత్ శాఖ
- మన్సుఖ్ మాండవీయ – కార్మికశాఖ,క్రీడలు
- శోభా కరంద్లాజే – చిన్న, మధ్యతరహా సహాయ మంత్రి
- జితిన్ రామ్ మాంజీ – చిన్న, మధ్యతరహా శాఖ
- సురేష్ గోపి – టూరిజం శాఖ
- పీయూష్ గోయల్ – వాణిజ్యం
- గిరిరాజ్ సింగ్- జౌళిశాఖ
- మాండవియా – కార్మిక శాఖ
- శర్బానంద సోనోవాల్ – షిప్పింగ్
- రవనీత్ బిట్టు – మైనార్టీ వ్యవహారాల సహాయమంత్రి
తాజా వార్తలు
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్









